మున్సిపల్ చైర్మన్ కు ఘన సత్కారం

మున్సిపల్ చైర్మన్ కు ఘన సత్కారం

  • శుభాకాంక్షలు తెలిపిన బ్లాక్ కాంగ్రెస్ ఇంచార్జ్ నాగరబోయిన శ్రీరాములు

స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ: స్టేషన్ ఘన్‌పూర్ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్‌కు ఘన సత్కారం నిర్వహిం చారు. ఈ సందర్బంగా స్టేషన్ ఘన్‌పూర్ బ్లాక్ కాంగ్రెస్ ఇంచార్జ్ నాగర బోయిన శ్రీరాములు ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన తాటి కొండ వినయ్ కుమార్ (సన్నీ)కు శాలువాతో సత్కారం చేసి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కాగా 18వ వార్డు కౌన్సిలర్ పొన్న రవిని కూడా శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.

అనం తరం శ్రీరాములు మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పొన్న శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు ఎదునూరి రమేష్, పొన్న రమేష్, పొన్నసత్యనారాయణ, అక్కనపల్లి సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply