Mulugu | గుత్తికోయలకు బ్లాంకెట్స్, స్వెటర్ల పంపిణీ

Mulugu| గుత్తికోయలకు బ్లాంకెట్స్, స్వెటర్ల పంపిణీ

Mulugu| ఆంధ్రప్రభ ప్రతినిధి, ములుగు : ములుగు జిల్లా (Mulugu District) ఏటూరు నాగారం మండలం బుటారం గుత్తికోయ గూడెంలో ఆదివాసీ కుటుంబాలకు ఉపశమనంగా శీతాకాల సహాయ సామాగ్రిని అందించారు. రిలయబుల్ ట్రస్ట్‌ హైదరాబాద్ వారి సహకారంతో చింతలపాడు, గుండంగా వాయ్, గంటలకుంట ప్రాంతాల గుత్తికోయల (Guthikoyalu) కు మొత్తం 208 బ్లాంకెట్లు, స్వెటర్లు పంపిణీ చేశారు.

రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా–శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క (Seethakka) కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టీ.ఎస్., గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి పాల్గొన్నారు.

Leave a Reply