Mulugu | సర్పంచ్16, వార్డు నెంబర్లు11 నామినేషన్లు దాఖలు.

Mulugu | సర్పంచ్16, వార్డు నెంబర్లు11 నామినేషన్లు దాఖలు.

Mulugu | ములుగు, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మొదటి రోజు ఉదయం 10-30 నుండి సాయంత్రం 5-00 గంటల వరకు ఈ రోజు మండలంలో 16 మంది సర్పంచుల(16 serpents)కు, 11 మంది వార్డు మెంబర్లకు నామినేషన్ పత్రాలు(Nomination papers) దాఖలు చేశారు. మండలంలో 26 గ్రామ పంచాయతీలకు గాను7 క్లస్టర్లుగా విభజించగా 5 క్లస్టర్లలో నామినేషన్లు దాఖలయ్యాయి.

ఇందులో భాగంగా సింగన్న గూడ క్లస్టర్‌లోనీ కొక్కొండ గ్రామ పంచాయతీలో 2 సర్పంచ్ కు, 5 వార్డులకు, సింగన్న కూడా గ్రామపంచాయతీలో 2 సర్పంచ్ కు, 6 వార్డులకు, కొత్తూరు క్లస్టర్లో బస్వాపూర్ గ్రామ పంచాయతీలో 1 సర్పంచ్ కు, కొత్తూరు గ్రామపంచాయతీలో 3 సర్పంచ్ కు, గంగాధర్ పల్లి 1సర్పంచ్ కు, క్షీరసాగర్ 2 సర్పంచ్ కు, నర్సంపల్లి క్లస్టర్ లో కొట్టాల 2 సర్పంచ్ కు, నర్సంపల్లి 1 సర్పంచ్ కు, చిన్న తిమ్మాపూర్ క్లస్టర్‌లో తునికి బొల్లారం 1 సర్పంచ్ కు, చిన్న తిమ్మాపూర్ 1 సర్పంచ్ కు నామినేషన్లు దాఖలు కాగా మొత్తం16 సర్పంచులకు, 11 వార్డు మెంబర్లకు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఆయా కస్టర్ల ఎన్నికల అధికారులు తెలిపారు.

Leave a Reply