వాజేడు, జులై 9, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా (Mulugu District) వాజేడు మండలంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) 54వ పుట్టినరోజు వేడుకలు కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కాకర్లపూడి విక్రాంత్ (Kakarlapudi Vikrant) ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఎస్సీ హాస్టల్ (SC Hostel) లోని విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ములుగు జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మంత్రి సీతక్క నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తమ సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మంత్రి సీతక్క (Minister Sitakka) కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు దాట్ల సీతారామరాజు, నాగారం మాజీ సర్పంచ్ తలడి ఆదినారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్కే కాజావలి, ఎస్కే షబ్బీర్ పాషా, అనుముల సంజీవ్, చెన్నం శ్రీను, జీ.ఏసు, తదితరులు పాల్గొన్నారు.