Mulugu District | కన్నుల పండువగా ఉమాచంద్రశేఖరుల కళ్యాణం..

Mulugu District | కన్నుల పండువగా ఉమాచంద్రశేఖరుల కళ్యాణం..

Mulugu District, మంగపేట, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలోని శ్రీ ఉమా చంద్రశేఖర స్వామి దేవస్థానంలో శివపార్వతుల కల్యాణం వైభవోపేతంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు విస్సావజ్జుల నరేష్ శర్మ ఆధ్వర్యంలో ఉమాచంద్రశేఖర స్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను పట్టువస్త్రాలతో, వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ అర్చకులు విస్సావజ్జుల నరేష్ శర్మ వేదమంత్ర పఠనాల నడుమ మంగళ వాయిద్యాలతో శివాలయ బాహ్యప్రాకార వేదిక పై ప్రత్యేకంగా అలంకరించిన కళ్యాణ మండపంలో ఉత్సవ విగ్రహాలను అధిష్ఠింపజేశారు.

అనంతరం రాత్రి 11 గంటల నుండి సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా అర్చకులు విస్సావజ్జుల నరేష్ శర్మ మంతోచ్ఛారణల మధ్య నిర్వహించిన స్వామివారి కళ్యాణాన్ని వందలాది మంది భక్తులు తిలకించి తన్మయత్వం పొందారు. భక్తులు జాగారంతో శివనామ స్మరణ చేస్తూ కళ్యాణ తంతును కనులారా వీక్షించారు. కళ్యాణానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఆలయ చైర్మన్ కోలగట్ల నరేష్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు.

Leave a Reply