అక్టోబర్ 16న ముహూర్తం ఖరారు

  • నంద్యాల జిల్లాలో ఘన స్వాగతం
  • కర్నూలులో కూటమి ర్యాలీలో హాజరు

శ్రీశైలం, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దర్శనార్థం భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi) వస్తున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) నంద్యాల జిల్లా టీడీపీ(TDP) నాయకులకు శనివారం సమాచారం ఇచ్చారు. ముందుగా నరేంద్ర మోడీ శ్రీశైలంలోని మల్లన్నదర్శనం చేసుకున్నఅనంతరం కర్నూలు జిల్లా(Kurnool district)లోనూ పర్యటిస్తారు. నంద్యాల జిల్లాలో ప్రధాని మోడీకి స్వాగతం పలకాలని టీడీపీ నాయకులకు ఆదేశించారు.

ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత నరేంద్ర మోడీ తొలిసారిగా నంద్యాల జిల్లా శ్రీశైలంలోని భ్రమరాంబికా మల్లికార్జున స్వామి(Bhramarambika Mallikarjuna Swamy) దర్శనార్థం రావడం విశేషం. శ్రీశైలంలోని భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని గతంలో ప్రధానమంత్రి హోదాలో జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావు, దర్శించుకున్నారు జీఎస్టీ సంస్కరణల పై కర్నూలు(Kurnool)లో మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ భారీ ర్యాలీకి ఏర్పాట్లు చేస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.

ఈ కార్యక్రమానికి భద్రతా వ్యవస్థలు పటిష్ఠంగా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలుస్తోంది. రోడ్‌షో(roadshow) సందర్భంగా మోదీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశమూ ఉన్నట్లు సమాచారం. ఏపీ రాజకీయాల్లో వేడి పెరుగుతున్నసమయంలో ప్రధాని పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. వచ్చే ఎన్నికల దృష్ట్యా ఇది కీలక పర్యటనగా భావిస్తున్నారు. కర్నూలు పర్యటన సందర్భంగా మోదీ, బీజేపీ – టీడీపీ -జనసేన(BJP – TDP – Jana Sena) కూటమి నేతలతో కీలకంగా చర్చించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.

Leave a Reply