Narayanpet | పల్లెపల్లెకు ముదిరాజ్ జెండా

Narayanpet | పల్లెపల్లెకు ముదిరాజ్ జెండా

Narayanpet | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఈ నెల 21న జరగనున్న “తెలంగాణ ముదిరాజ్ మహాసభ (Telangana Mudiraj Mahasabha)11వ వార్షికోత్సవ వేడుకల” పోస్టర్‌ను ఈరోజు ఘనంగా విడుదల చేశారు. “పల్లె పల్లెకు ముదిరాజ్ జెండా – ముదిరాజ్ ఆత్మగౌరవ ఎజెండా” నినాదంతో మొదటిసారిగా ముదిరాజులే మత్స్యకారులని వెల్లడించిన 2014లో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని ప్రవేశపెట్టిన సంఘం తెలంగాణ ముదిరాజ్ మహాసభ.

ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు మత్స్యకారుల కోసం ప్రభుత్వాన్ని (government) మెప్పిస్తూ, ఒప్పిస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలను సాధించిన సంఘంగా గుర్తింపు పొందింది. గత 68 సంవత్సరాల్లో సాధ్యం కాని మార్పులను గత 11 ఏళ్లలో ముదిరాజ్ మహాసభ సాధించిందని నాయకులు పేర్కొన్నారు. ఇంకా సాధించాల్సినవి ఎన్నో ఉన్నందున ముదిరాజ్ జెండాను, ముదిరాజుల ఎజెండాను మరింత బలంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని వారు పిలుపునిచ్చారు.

నవంబర్ 21న జరిగే కార్యక్రమ వివరాలు ప్రతి గ్రామంలో ఉదయం 9:00 గంటలకు ముదిరాజ్ జెండా(Mudiraj flag) ను ఎగురవేయాలి. అనంతరం నారాయణపేట జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న జిల్లా మత్య్స సహకార సంఘం కార్యాలయం వద్ద ఉదయం 11:00 గంటలకు చేరుకొని జెండా ఆవిష్కరణ చేసి సంబరాలు జరుపుకోనున్నారు. ప్రతి ముదిరాజ్ సమాజస్తులు పాల్గొని వార్షికోత్సవ వేడుకలు, ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని విజయవంతం చేయాలని నాయకులు కోరారు.

ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం (Mudiraj community) జిల్లా అధ్యక్షులు సరాఫ్ నాగరాజ్, పట్టణ అధ్యక్షులు బి.వెంకటయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొనంగేరి హన్మంతు, జిల్లా మత్య్స సహకార సంఘం అధ్యక్షులు ఎం.కాంత్ కుమార్, జిల్లా ఆర్.టి.ఎ. మెంబర్ పోషల్ రాజేష్, యువత అధ్యక్షులు ఎం.రాము, పి.ఎ.సి.యస్. డైరెక్టర్ సంకలపూరం మల్లెష్, డాక్టర్ కాకర్ల భీమయ్య, పళ్ళ వెంకట్రాములు, బపన్‌పల్లి పరమాత్మ, సంజీవ్ రిపోర్టర్, గొడుగు లక్ష్మణ్, సిరి, పాండు, ఓబణ్ణ, గబ్బర్ రాజు, నక్క శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply