Mudhol | బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పూలే కృషి

Mudhol | బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పూలే కృషి
Mudhol | ముధోల్, ఆంధ్రప్రభ : బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మహాత్మా జ్యోతిబా పూలే(Mahatma Jyotiba Phule) ఎనలేని కృషి చేశారని అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు అన్నారు. ఈ రోజు మండల కేంద్రమైన ముధోల్(Mudhol)లోని జ్యోతిబా పూలే చౌరస్తా వద్ద వర్ధంతి(death anniversary) సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ.. జ్యోతి బాపూలే ఆదర్శనీయుడనీ, అనగారిన వర్గాల ప్రజలకు విద్యాబోధనలు(Educational Teachings) చేసిన గొప్ప వ్యక్తి అని అన్నారు. దేశంలోనే మహాత్మ అని బిరుదు పొందిన ఒకే ఒక్కరు జ్యోతిబా ఫూలే అన్నారు.
ప్రతి ఒక్కరు ఆయన చూపిన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు రాహుల్, సునిల్, దిగంబర్, సచిన్, లక్షదీప్ (రాజు), మహేష్, సాయి కిరణ్, అవినాష్, కిరణ్ ఆదిత్య, సాయినాథ్, సంజు తదితరులున్నారు.
