మెగా రైతు మేళాకు ముధోల్ వ్యవసాయ పరిశోధన కేంద్రం సిబ్బంది

ముధోల్ , ఆంధ్రప్రభ : కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్శిటీ (PITAV) సంయుక్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా రాజేంద్రనగర్ లో మెగా రైతు మేళాను నిర్వహించిన కార్యక్రమంలో ముధోల్ మండల కేంద్రంలో గల వ్యవసాయ పరిశోధనా స్థానం సిబ్బంది పాల్గొన్నారని డైరెక్టర్ డా. ఆకుల దినేష్ శాస్త్రవేత్త (వృక్ష ప్రజననం) ఒక ప్రకటనలో తెలిపారు.ఈ కార్యక్రమంలో రైతులకు నాణ్యమైన ఎరువులు, పంటసంరక్షణ, సమగ్ర పోషక నిర్వహణ, శాస్త్రీయజ్ఞానం మరియు ఆదునిక సాంకేతికత గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ముధోల్ మండల కేంద్రంతో పాటు దౌలతాబాద్, విట్టోలి, కారేగాం, కర్గుల్, తిమ్మాపూర్ గ్రామాల నుండి 50 మందికి పైగా రైతులు పాల్గొన్నారు.
