పతంజలి యోగ ఆధ్వర్యంలో మట్టి స్నానాలు…

ఎడపల్లి, ఆంధ్రప్రభ ; ఎండాకాలం సందర్భంగా చర్మ సంబంధ సమస్యలు తలెత్తుతాయని అలాగే సోరియసిస్ వంటి దీర్ఘకాలిక, చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు మట్టి స్నానం ఆచరిస్తే చర్మం పై సూక్ష్మ రంద్రాలు పరిశుభ్రమై చర్మ వ్యాధులు నయమవుతాయని యోగ గురువు ఎక్కొండ ప్రభాకర్ పేర్కొన్నారు. ఎడపల్లి మండలంలోని అలీసాగర్ రిజర్వాయర్ బోటింగ్ పాయింట్ వద్ద పతంజలి యోగ గురువు ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆదివారం (మడ్ బాత్)మట్టి స్నానం కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో  చర్మ సమస్యలు తలెత్తుతాయని అలాగే దీర్ఘకాలిక చర్మ సంబంధించిన వ్యాధులు బాధపెడుతున్నా మట్టి స్నానం ద్వారా చర్మ రోగాలు నివారించుకోవచ్చని ఆయన తెలిపారు.మట్టి స్నానం లో ఉపయోగించే పుట్ట మట్టిలో వివిధ రకాల వనమూలికలను, గోమూత్రాన్ని కలిపి మృతిక స్నానాకి ఉపయోగి స్తారన్నారు.

దీనిద్వారా చర్మ సౌందర్యం పెరిగి కాంతివంతంగా తయారౌతుందన్నారు.చర్మ వ్యాధుల నుండి కాపాడుకోవాలనుకొనే వారు వనమూలికలతో కూడిన మట్టిని శరీరానికి అంతటా రాసుకొని రెండు గంటల పాటు ఎండలో నిలబడి ఈ మట్టిస్నానం ఆచరించాలని ఆయన పేర్కొన్నారు.దీంతో శరీరం మంచి కాంతివంతంగా తయారవడమే కాకుండా చర్మ వ్యాధులు దూరమౌతాయన్నారు.ఇందులో సుమారు 200 మంది యోగ సాధకులు పాల్గొన్నారు.

Leave a Reply