అంతర్జాతీయ మహిళా దినోత్సవ సన్మాన సభ

అంతర్జాతీయ మహిళా దినోత్సవ సన్మాన సభ
నల్లబెల్లి, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పిఆర్టియు టిఎస్ నల్లబెల్లి మండల అధ్యక్షులు ఉడుత రాజేందర్ అధ్యక్షతన ఎంపీడీవో కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ ఎం. అనురాధ మాట్లాడుతూ, మహిళలు బలహీనులు కాదు, విద్య, వాణిజ్యం, పరిశ్రమలు, అంతరిక్షం వంటి అందరంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారని, ఉన్నత స్థానాల్లో ఉండాలని పిలుపునిచ్చారు.
నల్లబెల్లి సర్పంచ్ నాగేల్లి జ్యోతి మాట్లాడుతూ, స్త్రీలు కుటుంబం, బాధ్యతల కోసం త్యాగాలు చేస్తూ రాజకీయం, ఉద్యోగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. పిఆర్టియు టిఎస్ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి నక్కిరెడ్డి మహేందర్ మాట్లాడుతూ… మహిళలు అంతరిక్షం వరకు ప్రస్థానం చేసి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని, పిఆర్టియు టిఎస్ 5 సెలవులు, హెల్త్ కార్డులు అందించినట్టు ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి నాయకత్వంలో మరిన్ని సంక్షేమాలు రానున్నాయని తెలిపారు.
అనంతరం మండలంలోని 60 మంది ఉపాధ్యాయినిలకు సన్మానాలు అందజేశారు. కార్యక్రమంలో పిఆర్టియు టిఎస్ నల్లబెల్లి ప్రధాన కార్యదర్శి బానోత్ కృష్ణ, రాష్ట్ర కార్యదర్శి ఓ. శ్రీదేవి, జిల్లా కార్యదర్శి ఆర్. రజిత, మండల ఉపాధ్యక్షురాలు సిహెచ్. స్వరాజ్యం, ఇతరులు పాల్గొన్నారు.
