MPDO | నామినేషన్ సెంటర్ల పరిశీలన
MPDO | భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా ఎన్నికల (Election) జనరల్ పరిశీలకుడు శ్యామ్ ప్రసాద్ గురువారం భీమ్గల్ మండలంలోని జాగిర్యాల్ నామినేషన్ సెంటర్ ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమావేశమై ఎన్నికల నిర్వహణ, నామినేషన్ స్వీకరణ అంశాలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్, తహశీల్దార్ మొహమ్మద్ షబ్బీర్, ఎస్సైకే.సందీప్, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

