భాస్కర్ రావును పరామర్శించిన ఎంపీ రవిచంద్ర

ఖమ్మం, ఆంధ్రప్రభ : ఇటీవల అనారోగ్యానికి గురై ఖమ్మం నగరంలోని స్థంభాద్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ వ్యాపారవేత్త, ఖమ్మం వాసి ఆకుల భాస్కర్ రావును రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర శనివారం పరామర్శించారు.
ఈ సందర్భంగా భాస్కర్ రావుకు అందుతున్న చికిత్సపై ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.
అనంతరం అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చింతకాని మండలం నామవరం గ్రామానికి చెందిన హరిప్రసాద్‌ను కూడా ఎంపీ పరామర్శించారు. ఎంపీ రవిచంద్ర వెంట మున్నూరు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుల గాంధీ కూడా పాల్గొన్నారు.
