జన్ విశ్వాస్ సవరణ బిల్లును వ్యతిరేకించిన ఎంపీ

జన్ విశ్వాస్ సవరణ బిల్లును వ్యతిరేకించిన ఎంపీ

వరంగల్ సిటీబ్యూరో, ఆంధ్రప్రభ : జన్ విశ్వాస్ (సవరణ) బిల్లును లోక్‌సభలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య వ్యతిరేకించారు. వ్యాపార సౌలభ్యం పేరుతో తీసుకొస్తున్న ఈ బిల్లులో పలు కీలక నిబంధనలను డీక్రిమినలైజ్ చేయడం వల్ల నియంత్రణ వ్యవస్థ బలహీనపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రత్యామ్నాయ అమలు విధానాలు బలంగా లేకుండా చట్టపరమైన శిక్షలను తగ్గించడం వల్ల ఉల్లంఘనలు పెరిగే అవకాశం ఉందని ఎత్తి చూపారు.

ముఖ్యంగా ప్రజా ఆరోగ్యం, పర్యావరణం, కార్మిక హక్కుల వంటి కీలక రంగాలు దెబ్బతినే ప్రమాదం ఉందని వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య హెచ్చరించారు. వ్యాపారాలకు అనుకూలత కల్పించడమే కాకుండా ప్రజల హక్కులు, భద్రతను కాపాడే బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని ఆమె గుర్తు చేశారు. ఇలాంటి కీలక సవరణలపై విస్తృత చర్చ జరిపి, అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య డిమాండ్ చేశారు.

Leave a Reply