కేంద్రమంత్రిని కలిసిన ఎంపీ సురేష్

కేంద్రమంత్రిని కలిసిన ఎంపీ సురేష్
నూతన రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి
బిక్కనూర్,ఆంధ్రప్రభః కొత్త జాతీయ రహదారులతోపాటు, బ్రిడ్జిల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు సురేష్ కోరారు. దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ కలిసి వినతి పత్రం అందజేశారు. జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని కామారెడ్డి ,సంగారెడ్డి జిల్లాలో వివిధ రహదారులపై కొత్త జాతీయ రహదారుల ఏర్పాటుకు కావలసిన నిధులు మంజూరు చేయాలని సూచించడం జరిగిందని ఎంపీ తెలిపారు.
దీనికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. పలు జాతీయ రహదారుల వద్ద సర్వీస్ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరగా త్వరలో మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ షట్కర్ ఉన్నారు.
