దుర్గమ్మ సన్నిధిలో ఎంపీ కలిశెట్టి
- వీఐపీలకు గుణపాఠం
విజయవాడ, ఆంధ్రప్రభ : సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చి.. వారికి సత్వర దర్శన భాగ్యం కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) చెప్పిన మాటలను గౌరవిస్తూ సాధారణ భక్తుడిలా క్యూ లైన్(queue line)లో బంగారు వాకిలి నుంచి దర్శనం చేసుకున్నానని విజయనగరం(Vizianagaram) పార్లమెంట్ సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.
శ్రీ కాత్యాయనీ దేవి(Sri Katyayani Devi) అవతారంలో దర్శనమిచ్చిన జగన్మాతను గురువారం ఆయన దర్శించుకున్నారు. వీఐపీ దర్శనాలకు దేవస్థానం కేటాయించిన సమయాలలో మాత్రమే దర్శనం చేసుకోవాలని సూచించారు. అలా చేసుకోలేని సందర్భాలలో సాధారణ భక్తులతో సమానంగా దర్శనం చేసుకోవడం సైతం దేవుని సేవలో భాగమేనన్నారు.
క్యూ లైన్ లో ఉన్నభక్తుల(Devotees)తో తాను మాట్లాడినప్పుడు దేవస్థానం, జిల్లా యంత్రాంగం(Yantra) చేసిన ఏర్పాట్లు చాలా సంతృప్తికరంగా ఉన్నాయని భక్తులు చెప్పిన విషయం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. దుర్గామాత అనుగ్రహంతో రాష్ట్రం(State) అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని లోకమాతను ప్రార్థించినట్లు తెలిపారు.