కుమ్మెర జాతర ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలి

కుమ్మెర జాతర ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలి
- డీజీపీకి ఎంపీ, ఎమ్మెల్యేల వినతి
నాగర్ కర్నూల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామ జాతర సందర్భంగా చోటుచేసుకున్న పరస్పర దాడులు, చిన్నారి మృతి ఘటనలపై పూర్తిస్థాయి విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యేలు డాక్టర్ రాజేష్ రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, ఈర్లపల్లి శంకర్ శనివారం రాత్రి డీజీపీ శివశంకర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ ఘటనలు జరగడం దురదృష్టకరమని పేర్కొంటూ, సంఘటనలకు దారితీసిన పరిస్థితులపై లోతైన విచారణ జరపాలని కోరారు. దోషులు ఏ స్థాయి వారైనా, ఏ పార్టీకి చెందిన వారైనా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం, పార్టీ పరంగా పూర్తిగా సహకరిస్తామని తెలిపారు.
ఈ ఘటనపై ఇప్పటికే విచారణ కొనసాగుతోందని, సమగ్ర దర్యాప్తు అనంతరం నిజానిజాలు వెలికి తీసి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హామీ ఇచ్చినట్లు సమాచారం.
