Motorcycle | లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండు నిండు ప్రాణాలు బలి…

Motorcycle | లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండు నిండు ప్రాణాలు బలి…

Motorcycle | గోనెగండ్ల, ఆంధ్రప్రభ : లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండు నిండు ప్రాణాలు బలైన సంఘటన మండల కేంద్రమైన గోనెగండ్లలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గోనెగండ్ల గ్రామానికి చెందిన బోయ కొండయ్య మద్దమ్మ కుమారుడైన బోయ మునిస్వామి (31), మొండి సుంకన్న, అచ్చమ్మల కుమారుడైన వీరేశులు (17) అనే ఇద్దరు యువకులు ఉగాది పండుగకు కొత్త బట్టలు తెచ్చుకోవడానికి ఏపీ 29 జే క్యు 63 83 అనే మోటార్ సైకిల్ పై వెళ్తూ ఉండగా మండల కేంద్రమైన గోనెగండ్లలోని స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్ సమీపంలో ఎమ్మిగనూరు నుండి వెళ్తున్న లారీ ఏపీ 21వై 66 69 అనే నెంబర్ గల లారీ మోటర్ సైకిల్ ని ఢీ కొట్టింది. దీంతో మోటార్ సైకిల్ పై వెళ్తున్న మునిస్వామి, వీరేశులు కింద పడ్డారు.

కింద పడ్డ వీరిపై నుంచి లారీ టైర్లు ఎక్కడంతో బోయ మునిస్వామి అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, వీరేశ్కు తీవ్ర గాయాలు అయ్యాయి. తీవ్ర గాయా పాలైన మొండి వీరేశను చికిత్స కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఆ రెండు కుటుంబాలలో విషాదఛాయలను అలముకున్నాయి.

అయితే మృతులు బోయ మునిస్వామి, వీరేశులు బతుకుతెరిపి కోసం తెలంగాణలో కూలి పనుల వెళ్లి ఉగాది పండగ కోసం సోమవారం రాత్రి ఊరికి వచ్చారు. పండగకు బట్టలు తెస్తామని వెళ్లిన ఇరువురు ప్రమాదంలో మరణించడంతో ఆ రెండు కుటుంబాలలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుడు బోయ మునిస్వామికి ఇద్దరు కుమారులు ఒక కొడుకు ఉన్నారు. అతివేగముగా నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపిన లారీ డ్రైవర్ మహబూబ్ బాషా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రబాబు తెలిపారు.

Leave a Reply