Motkur | మోత్కూర్ మండలంలో 28శాతం పోలింగ్

Motkur | మోత్కూర్ మండలంలో 28శాతం పోలింగ్

Motkur | మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలంలో బుధవారం నిర్వహిస్తున్న 3వ విడత పోలింగ్ 10 గ్రామపంచాయతీల్లో ప్రశాంతంగా కొనసాగుతుంది. భువనగిరి ఆర్ డి ఓ ఎం కృష్ణారెడ్డి అన్ని పోలింగ్ కేంద్రాలకు ఎప్పటికప్పుడు పరిశీలించి, పోలింగ్ సరళిని పర్యవేక్షణ చేస్తున్నారు. ఉదయం 9 గంటల వరకు 28శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 13,215 ఓట్లకు గాను 3686 ఓట్లు పోలయ్యాయి.

2022 మంది పురుష,1664 మంది మహిళా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు. పాటిమట్ల మోడల్ పోలింగ్ కేంద్రంలో గ్రీన్ పోలింగ్ ఏర్పాటు చేసి ఓటర్లకు పూలతో స్వాగతం పలుకుతూ, వృద్ధులు, వికలాంగులకు వీల్ చైర్ల సహాయంతో వాలంటీర్లు ఓట్లు వేయిస్తున్నారు.

Leave a Reply