Mothkur | మహిళలకు పట్టం..

Mothkur | మహిళలకు పట్టం..

  • మున్సిపాలిటీ లో…మహిళా ఓటర్లు అధికం
  • తొలి చైర్మన్ గా మహిళే
  • ఈ దఫా చైర్మన్ గా మహిళనే
  • మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు..6 వార్డులు మహిళలకే
  • మహిళలే మహారాణులు

Mothkur | మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ లో మహిళలే మహారాణులుగా మారనున్నారు. మున్సిపాలిటీ లో 12 వార్డులకు గాను మొత్తం 14,383 మంది ఓటర్లు ఉన్నారు.ఈ ఓటర్లలో 7106 మంది పురుషులు కాగా…,7277 మంది మహిళా ఓటర్లు ఉండగా…పురుషులు కంటే 171 మంది మహిళలు అధికంగా ఉన్నారు. 12 వార్డులలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో…మొత్తం 12 వార్డులలో …6 వార్డులు మహిళలకే కేటాయించారు. మోత్కూర్ తొలి మున్సిపాలిటీ లో తొలి చైర్మన్ గా 7 వ వార్డ్ కౌన్సిలర్ గా గెలుపొందిన తీపిరెడ్డి సావిత్రి మేఘారెడ్డి (బి ఆర్ ఎస్) కొనసాగగా…9 నెలల చివరి కాలంలో అవిశ్వాసంతో 11 వ వార్డు కౌన్సిలర్ గా గెలుపొందిన గుర్రం కవిత లక్ష్మినర్సింహ రెడ్డి (కాంగ్రెస్) చైర్మన్ గా కొనసాగారు. ఈ దఫా చైర్మన్ పదవి కాస్త …ఎస్సి మహిళ కు రిజర్వ్ కావడంతో ..మళ్లీ చైర్మన్ గా మహిళ కొనసాగనుంది.

23 ఏండ్ల తర్వాత మహిళలకు అధికారం..

మోత్కూర్ గ్రామపంచాయతీ ఏర్పడిన నాటి నుండి సుమారు 42 ఏండ్లుగా పురుషులే సర్పంచ్ లుగా కొనసాగారు.ఎట్టకేలకు 2001 లో మోత్కూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానం బి సి మహిళకు కేటాయించడంతో …నాడు ఆవిర్భవించిన టి ఆర్ ఎస్ ఉద్యమ పార్టీ తరపున కల్వల కృష్ణవేణి తిరుమల్ రావ్ సర్పంచ్ గా గెలుపొందారు. అప్పటి నుండి మళ్లీ మహిళలకు సర్పంచ్ పదవి దక్కలేదు.2018 లో మోత్కూర్ మున్సిపాలిటీ గా ఆప్గ్రేడ్ అయ్యింది.సుమారు 19 ఏండ్ల తర్వాత 2020 లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో మళ్లీ జనరల్ మహిళ కోటాలో మహిళ మున్సిపల్ చైర్మన్ పదవి అలంకరించారు.ఈ దఫా సైతం మహిళలకే మున్సిపల్ చైర్మన్ పదవి రావడంతో మహిళలకు పట్టం కట్టినట్లైంది.

Leave a Reply