Mothkur | ప్రజా ప్రతినిధిగా కొనసాగా…ప్రజా సేవకే అంకితమౌతా..!

Mothkur | ప్రజా ప్రతినిధిగా కొనసాగా…ప్రజా సేవకే అంకితమౌతా..!
7వ వార్డు అభివృద్ధి లక్ష్యం
కాంగ్రెస్ అభ్యర్ధి గనగాని శైలజ నర్సయ్య గౌడ్
Mothkur | మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీలో ప్రజల ఆశీర్వాదంతో గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ గా, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యునిగా పనిచేసిన తాను ..ప్రజాప్రతినిదిగా ప్రజా సమస్యల పరిష్కారం తెల్సిన తమను ఈ ఒక్కసారి అవకాశం ఇచ్చి కౌన్సిలర్ గా గెలిపిస్తే ప్రజా సేవకు అంకితమౌతామని 7వ వార్డు కాంగ్రెస్ అభ్యర్ధి గనగాని శైలజ నర్సయ్య గౌడ్ లు ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.7 వ వార్డులో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ సహకారంతో మరిన్నీ అభివృద్ధి పనులు చేపడుతామని, అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేస్తామన్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ లు, త్రాగునీరు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని హామీ ఇస్తూ ప్రచారంలో ముందంజలో కొనసాగుతున్నారు. ఈ నెల 11 న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.
