నెల్లూరు జిల్లా గోళ్లవారిపలిలో శోకసంద్రం
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఈ దుర్ఘటనలో ఇద్దరు బిడ్డలతో దంపతులు దుర్మరణం చెందారు. నెల్లూరు (Nellore) వింజమూరు మండలం గోళ్లవారిపల్లికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఈ నలుగురు మృతి చెంఆరు. గొల్ల రమేష్ (37), అనూష (32), మనీష్ (12), మన్విత (10) మృతి చెందినట్టు గుర్తించారు. కంపెనీ ట్రిప్పులో కుటుంబ సభ్యులతో హైదరాబాద్ (Hyderabad ) విహారయాత్రకు రమేష్ వెళ్లారు. హైదరాబాద్ నుంచి తిరి ఇంటికి వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. ఈ నలుగురి మృతితో గోళ్లవారిపల్లి గొల్లుమంది.

