ఆలేరు 12 వార్డు లో మోర్తల సునీత రమణారెడ్డి ప్రచారం..

ఆలేరు 12 వార్డు లో మోర్తల సునీత రమణారెడ్డి ప్రచారం..
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 12 వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి మోర్తల సునీత రమణారెడ్డి ఆదివారం ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. వార్డు సమగ్ర అభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తానని ఓటర్లకు ఆమె హామీ ఇచ్చారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి, మహిళలకు బొట్టు పెడుతూ తన ప్రచార కార్యక్రమాన్ని సునీత నిర్వహించారు.
