రైతు సంక్షేమానికి మరిన్ని పథకాలు
● ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మార్కెట్ చైర్ పర్సన్
మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణ పేట జిల్లా(Narayanapet District) మక్తల్ మండలంలోని పారేవుల గ్రామంలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న వరి కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గవినోళ్ళ రాధమ్మ, మంత్రి సోదరుడు వాకిటి శేషగిరి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వరికి మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్(Bonus) కూడా ప్రజా ప్రభుత్వం అందజేస్తుందని అన్నారు. రైతు పండించిన పంట చివరిదాకా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు.
రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ(Loan Waiver) చేసిందని గుర్తు చేశారు. రానున్న రోజుల్లోనూ రైతు సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయనున్నట్లు వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ బి. గణేష్ కుమార్, మాజీ జెడ్పిటిసి జి.లక్ష్మారెడ్డి(G. Lakshmareddy), డైరెక్టర్లు పాతింటి విష్ణువర్ధన్ రెడ్డి, ఎం. శ్రీనివాస్, సాలంబిన్ ఉమర్ బస్రవి, ఫయాజుద్దీన్, ఏఈఓ విజయ్, మాజీ సర్పంచ్ మనివర్ధన్, నాయకులు రవీందర్ రెడ్డి, ఆంజనేయులు, వసంత్ రెడ్డి, నాగరాజ్ గౌడ్ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు స్వప్న తదితరులు పాల్గొన్నారు.

