Mopidevi | స్వామివారి దర్శనం చేసుకుంటే..

Mopidevi | స్వామివారి దర్శనం చేసుకుంటే..

Mopidevi, మోపిదేవి, ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా (krishna district) మోపిదేవి గ్రామంలోని శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవాలయం భక్తులతో ఆదివారం కిటకిటలాడింది. రాష్ట్రంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులతో ఆలయ ప్రాంగణమంతా రద్దీగా మారింది. నాగపల్లి వృక్షం వద్ద ముడుపులు కట్టి అనంతరం నాగ పుట్టలో పాలు పోసిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు అవసరమైన ఏర్పాట్లను ఆలయ ఈవో దాసరి శ్రీరామ వర ప్రసాదరావు, ఆలయ ఉద్యోగులు పర్యవేక్షించారు.

దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్య క్రమం నిరంతరాయంగా కొనసాగుతుంది. కుజ, సర్ప దోష పూజలను భక్తులు నిర్వహించారు. స్వామి వారి దర్శనం చేసుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఆది, మంగళవారాల్లో అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటారు. భారీగా వాహనాలు రావటంతో రహదారులు కిటకిటలాడాయి. ట్రాపిక్ నియంత్రణ చేయటంలో ఇబ్బందులు కలిగాయి.

Leave a Reply