నెల్లూరు జిల్లాలో మొంథా తాకిడి
నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ : మొంథా తుఫాను(Montha storm) ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వాన కురుస్తుండడంతో జన జీవనం స్థంభించి పోయింది. సోమవారం రాత్రి నుంచే ప్రారంభం అయిన భారీ వర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. మామూలుకన్నా ఎత్తులో భీకరంగా వస్తున్న అలల కారణంగా తీరం కోతకు గురవుతోంది.
జిల్లా లోని అధికార యంత్రాంగం(Montha Cyclone) యావత్తూ తుఫాను సహాయక చర్యలలో నిమగ్నమయింది. మరోవైపు ఈదురుగాలులు భయంకరంగా వీస్తుండడంతో చెట్లు నేలకూలుతున్నాయి. అక్కడక్కడా విద్యుత్ కు అంతరాయం కలుగుతున్నట్లు సమాచారం వస్తోంది. జిల్లా తుఫాను ప్రత్యేక అధికారి యువరాజ్, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాలు(Himanshu Shukla), పరిస్థితులు తెలుసుకుంటూ అధికారులకు సూచనలు జారీ చేస్తున్నారు. కృష్ణ పట్నం(Krishna Patnam) ఓడరేవులో 5వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసారు.


