4 జిల్లాలకు మోంతా వార్నింగ్
తిరుపతి, ఆంధ్రప్రభ బ్యూరో (రాయలసీమ) : గత వారం పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇబ్బందులు పడుతున్న సీమ జిల్లాలకు మరో భారీ వర్ష గండం ఉందని వాతావరణ శాఖ ఈ రోజు సాయంత్రం హెచ్చరించింది. ఈ నెల 27వ తేదీ నుంచి మూడురోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలను బట్టి మూడునాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్(Red alert), మరో మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఇటీవలి వర్షాల నష్టాలను అంచనాలు వేయడంలో తలమునకలై ఉన్న జిల్లాల అధికార వర్గాలు తాజా హెచ్చరికలతో మూడు జాగ్రత్త చర్యలకు సన్నద్ధమవుతున్నాయి.
బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన అల్పపీడనాల కారణంగా గత వారం పదిరోజులుగా తూర్పు రాయలసీమ జిల్లాలో భారీగా, పశ్చిమ రాయలసీమ జిల్లాల్లో ఒక మోస్తరుగా వర్షాలు కురుస్తున్నాయి. సగటున 30 సెంటీమీటర్ల నుంచి 60 సెంటీ మీటర్ల వరకు నమోదైన వర్షాలతో దాదాపు 40 శాతం చెరువులు, జలాశయాలు జలకళ తో కళకళ లాడుతున్నాయి. మరోవైపు 25 వేల హెక్టార్లకు పైగా పంటలు నీటి ముంపునకు గురికాగా, అన్నిప్రాంతాల రోడ్లు వర్షపు నీటివరదలతో మునిగితేలుతున్నాయి.
ప్రజల కష్టాలను తగ్గించడంతో పాటు జరిగిన నష్టాలను అంచనా వేయడంలో అధికార యంత్రాంగాలు(mechanisms) తలమునకలై ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ శనివారం మరో వాన గండం పొంచివుందని హెచ్చరికలు జారీ చేసింది. బంగాళా ఖాతంలోని ఆగ్నేయ, మధ్య పశ్చిమ దిశల్లో ఈ నెల 27వ తేదీ సంభవించే అల్పపీడనం కారణంగా వచ్చే మొంతా తుఫాను ప్రభావం కనీసం మూడురోజులపాటు ఉంటుందని ఆ హెచ్చరికల సారాంశం. రాష్ట్ర వ్యాప్తంగా(Statewide) మధ్య, దక్షిణ కోస్తా తీరంలోని 12 జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాల ముప్పు ఉందని ఆ శాఖ హెచ్చరిస్తోంది.
అందులో ముఖ్యంగా సోమవారం రాయలసీమ పరిధిలోని తిరుపతి, అన్నమయ్య, వై ఎస్సార్ కడప జిల్లాల(Kadapa Districts)కు రెడ్ అలర్ట్, నంద్యాల, చిత్తూరు జిలాల్లకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అదే విధంగా మంగళ, బుధ వారాలలో వై ఎస్సార్ కడప, తిరుపతి జిల్లాలకు భారీ వర్ష సూచనలు ఉందని తెలియచేస్తోంది.
ఈ మేరకు ఆయా జిల్లాలకు అందిన హెచ్చరికలతో అప్రమత్తం అవుతున్న అధికార యంత్రాంగాలు ముందు జాగ్రత్త చర్యలకు సన్నద్ధమవుతున్నాయి ప్రస్తుతంకొనసాగిస్తున్న సహాయక చర్యలను పొడిగించడంతో పాటు నష్ట నివారణ చర్యలు తీసుకోడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ సారి భారీ వర్షాలతో పాటు పెనుగాలులు వీచే ప్రమాదం ఉందనే హెచ్చరికల(Alerts)తో అధికారులు ప్రజలను అప్రమత్తం చేసే చర్యలు తీసుకుంటున్నారు.

