న్యూ ఢిల్లీ |తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ప్రధాని మోదీ.కొత్తగా గెలుపొందిన అభ్యర్థులకు శుభాకాంక్షలు చెప్పారు.
ప్రజలతో మమేకమై గెలుపు కోసం శ్రమించిన కార్యకర్తలను చూసి గర్వపడుతున్నానన్నారు. ఎంఎల్సీ ఎన్నికల్లో అద్వితీయమైన మద్దతును ఇచ్చి తెలంగాణ బీజేపీని ఆశీర్వదించిన తెలంగాణ ప్రజలకు నా కృతజ్ఞతలు కొత్తగా ఎన్నికైన అభ్యర్థులకు నా అభినందనలు. ప్రజల మధ్య చాలా శ్రద్ధగా పనిచేస్తున్న మన పార్టీ కార్యకర్తలను చూసి నేను చాలా గర్వపడుతున్నాను అంటూ ట్వీట్ చేశారు.
https://twitter.com/narendramodi/status/1897484692594552988?t=SP5Di-HoqO1DH7JB7KMfJA&s=19
అటు ఏపీలో విజయంపై కూడా స్పందించారు మోడీ. విజయం సాధించిన ఎన్డీయే అభ్యర్థులకు అభినందనలు. కేంద్రంలోను మరియు ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్‌డిఎ ప్రభుత్వాలు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాయి . రాష్ట్రం అభివృద్ధి ప్రయాణాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తాయన్నారు
https://twitter.com/narendramodi/status/1897485107725738292?t=Oz-p6B1ig9B7utX8vojFNg&s=19
మోడీ ట్వీట్ కు స్పందించిన చంద్రబాబు
ప్రధాని పోస్టుకు సీఎం చంద్రబాబు స్పందించారు.ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్రంలోని ఎన్డీఏ పక్షాల తరఫున ధన్యవాదాలు.మోదీ నేతృత్వంలో ఎన్డీయే అటు దేశంలో ఇటు రాష్ట్రంలో మరెన్నో విజయాలను సాధిస్తుందని నమ్ముతున్నాను.ఎన్డీఏ పాలనలో అన్ని వర్గాల ప్రజల సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నాను.