Tour | మారిషస్ లో ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం మారిషస్ చేరుకున్నారు. మారిషస్ చేరుకున్న ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. అక్కడ 12న జరిగే మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతారు.

ఈ కార్యక్రమంలో భారత రక్షణ దళాల బృందంతో పాటు భారత నావికాదళ నౌక కూడా పాల్గొంటుంది. తన రెండు రోజుల పర్యటన సందర్భంగా, ప్రధాని మోదీ భారతదేశం – మారిషస్ మధ్య సామర్థ్య నిర్మాణం, వాణిజ్యం, సరిహద్దు ఆర్థిక నేరాలను ఎదుర్కోవడం వంటి రంగాలలో సహకారం కోసం అనేక ఒప్పందాలపై సంతకం చేస్తారు.

మారిషస్‌లోని ప్రవాస భారతీయులు ప్రధాని మోదీని స్వాగతించడానికి పోర్ట్ లూయిస్‌లోని ఒక హోటల్ వెలుపల పెద్దఎత్తున తరలివచ్చారు. భారత ప్రవాస భారతీయుడు శరద్ బరన్వాల్ మాట్లాడుతూ, ‘ప్రధాని రాకతో సంబరం చేసుకుంటున్నామన్నారు. భారతదేశం – మారిషస్ మధ్య స్నేహం ఎల్లప్పుడూ బాగుంది. ప్రధాని మోదీ ఈ పర్యటన తర్వాత, ఈ సంబంధం మరింత బలపడుతుందన్నారు.

మారిషస్‌లోని భారత హైకమిషనర్ సాంస్కృతిక కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కాదంబినీ ఆచార్య తదితరులు పెద్ద ఎత్తున ప్రవాస భారతీయులు తరలివచ్చారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన కారణంగా మారిషస్‌లో గంగా తలాబ్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. మారిషస్‌లో అత్యంత పవిత్రమైన హిందూ తీర్థయాత్ర స్థలంగా పిలువబడే గంగా తలావ్ భారతదేశంలోని పవిత్ర గంగా నదికి ప్రతీక. అలాగే సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిందని భావిస్తున్నారు. 1972లో గంగా జలాన్ని దాని నీటిలో కలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *