30 మిలియన్లు దాటిన సబ్‌స్క్రైబర్లు

30 మిలియన్లు దాటిన సబ్‌స్క్రైబర్లు
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ప్రధాని నరేంద్ర మోడీ మరో గ్లోబల్ రికార్డు సృష్టించారు. యూట్యూబ్‌లో ఆయన అధికారిక ఛానెల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 30 మిలియన్‌లు (3 కోట్లు) దాటింది. ప్రపంచ నేతల్లో అత్యధిక సబ్‌స్క్రైబర్లు కలిగిన రాజకీయ నాయకుడిగా తన స్థానాన్ని మరింత బలపరుచుకున్నారు.

రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్లు మోడీకి ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఛానెల్ సబ్‌స్క్రైబర్లతో పోలిస్తే మోడీ ఏడు రెట్లు (7X) అధికంగా ఉన్నారు. అలాగే రాహుల్ గాంధీ కన్నా ఆయనకు మూడు రెట్లు అధికంగా ఫాలోవర్లు ఉన్నారు. ఇది కేవలం సంఖ్యాపరమైన రికార్డు మాత్రమే కాదు – ప్రపంచ నాయకుల్లో డిజిటల్ మీడియాలో అత్యధిక ప్రజాబలం, ప్రజలతో నేరుగా సంబంధం కలిగి ఉన్న నాయకుడిగా మోడీ గుర్తింపును మరింత బలపరిచింది.
