Mock drill | సాగర్ కవచ్..
Mock drill, మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మెరైన్ డీఐజీ (DGP) గోపీనాథ్ జెట్టి ఆదేశాల మేరకు గురువారం మచిలీపట్నంలో సాగర్ కవచ్ మాక్ డ్రిల్ కార్యక్రమం కృష్ణా జిల్లా పోలీసులు నిర్వహించారు. సాగర్ కవచ్ అనేది భారతీయ తీర రక్షక దళం, ఇతర భద్రతా సంస్థలు నిర్వహించే ఒక వార్షిక సముద్ర భద్రతా విన్యాసం. సముద్ర ముప్పులను ఎదుర్కోవడానికి తీర ప్రాంత భద్రతా సంసిద్ధతగా ఈ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా తీర ప్రాంతంలో తీవ్రవాదులకు అడ్డుకట్ట వేసేందుకు ప్రతి సంవత్సరం కృష్ణాజిల్లా లో మాక్ డ్రిల్ నిర్వహిస్తారు.
మాక్ డ్రిల్ నిమిత్తం రాడార్ కేంద్రం, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్ కంపెనీ, రైల్వే స్టేషన్ పలు ప్రాంతాలలో పోలీసు (Police) బందోబస్తు ఏర్పాటు చేశారు. మాక్ డ్రిల్ నేపధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 1030 కిలోమీటర్ల తీర ప్రాంతంలో 21 పోలీస్ స్టేషన్ల సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మచిలీపట్నం మెరైన్ డీఎస్పీ బాలిరెడ్డి సాగర్ కవాచ్ కార్యక్రమం శుక్రవారం వరకు జరుగుతుందని తెలిపారు.

