MLC vote | సీనియర్ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలి

MLC vote | సీనియర్ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలి
- సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి…
- ఫిబ్రవరి 5న చలో ఢిల్లీ కార్యక్రమం చేపడతాం…
- టీఎస్ యుటీఎఫ్ జిల్లా కార్యదర్శి నామోజు శ్రీనివాస్…
MLC vote | కరీమాబాద్, ఆంధ్రప్రభ : అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటంలో భాగంగా సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్(Tet) నుండి పూర్తిస్థాయి మినహాయింపు ఇవ్వాలని, జాతీయ పెన్షన్ పథకం (NPS)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానంను పునరుద్ధరించాలని, జాతీయ విద్యా విధానం2020ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ప్రభుత్వ ఉన్నత పాఠశాల శివనగర్‌లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా టీఎస్ యుటిఎఫ్ వరంగల్ జిల్లా కార్యదర్శి నామోజు శ్రీనివాస్ మాట్లాడుతూ.. సర్వీస్(service)లో ఉన్న ఉపాధ్యాయులపై టెట్ రుద్దడం అన్యాయమని, సీపీఎస్ ద్వారా ఉపాధ్యాయుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుతున్నారని విమర్శించారు. కావున ఓ పి ఎస్ పునరుద్ధరణ చేయాలని కోరారు. ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఓటు(MLC vote) హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఎం ఈ పి 2020 పేరుతో ప్రభుత్వ విద్యను బలహీనపరిచే ప్రయత్నాలను యుటీఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఈ డిమాండ్లను వెంటనే పరిష్కరించని పక్షంలో ఫిబ్రవరి 5న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా “చలో ఢిల్లీ” కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాల, శివనగర్ ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు పూస నరేంద్ర స్వామి, పాక విజయ్, డి.తిరుపతి , ఎస్.లక్ష్మి నారాయణ,టి.దేవరాజు, టి.నరేందర్, ఎస్.కవిత, సిఎచ్ సంపత్, సుహాసిని, సుజాత, కృష్ణమూర్తి, స్వప్న, రాజు, శారద, భవాని తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
