బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ సత్యం

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర మహాత్మాజ్యోతిబా పూలే బిసి గురుకులాల విద్యాసంస్థల కార్యదర్శి బడుగు సైదులు తండ్రి బడుగు యాదగిరి ఇటీవల అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం చౌటుప్పల్ పట్టణంలోని ఆయన ఇంటికి వెళ్లి యాదగిరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు సైదులు తదితర కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు మాజీ మార్కెట్ చైర్మన్ బడుగు లక్ష్మయ్య, బడుగు శ్రీరాములు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె శేఖర్ రెడ్డి, మున్సిపల్ కార్యదర్శి పగిళ్ల మోహన్ రెడ్డి, ఉడుత రామలింగం, టంగుటూరి రాములు, కొండూరు వెంకటేష్, బత్తుల సుధాకర్, దాసరి మనోహర్, కొత్త వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply