MLC Kavitha | తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత

MLC Kavitha | తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత

MLC Kavitha | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : బీసీ కులగణన విషయంలో కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మోసం చేస్తోందని తెలంగాణ జాగృతి చీఫ్, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యాలయంలో ఇవాళ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈసందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ… కేంద్రం విడుదల చేసిన కులగణన డాక్యుమెంట్లో బీసీ అనే స్పెషల్ కాలమ్ లేకపోవడం బీసీ సామాజిక వర్గాలను అవమానించడమేనని ఆమె మండిపడ్డారు. గతంలో 2011లో కాంగ్రెస్ పార్టీ బీసీలను ఏ విధంగానైతే వంచించిందో ఇప్పుడు 2026లో బీజేపీ ప్రభుత్వం అదే పద్ధతిలో అన్యాయం చేస్తోందని విమర్శించారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణనపై తప్పుడు గణాంకాలను వెల్లడిస్తోందని, దీంతో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కవిత ఆరోపించారు.

కేవలం ప్రధాన కులాలే కాకుండా, బీసీల్లోని ప్రతి ఉప కులాన్ని కూడా విడివిడిగా లెక్కించాలని తెలంగాణ జాగృతి డిమాండ్ చేస్తోందన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తితో బీసీల హక్కుల కోసం తాము యుద్ధ భేరి మోగిస్తామన్నారు. బీసీ మేధావులతో సంప్రదింపులు జరుపుతున్నామని, ఈ మేరకు జనవరి 29న హైదరాబాద్ లో కీలకమైన రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించబోతున్నట్లుగా స్పష్టం చేశారు.

Leave a Reply