కాకినాడ : ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో కూటమి అభ్యర్ధి మెజార్టీ కొనసాగుతోంది.ఇప్పటికే నాలుగో రౌండు కౌటింగ్ పూర్తయింది. 1,22,000 ఓట్లు లెక్కింపు పూర్తి అయ్యే సమయానికి చెల్లుబాటు అయిన ఓట్లు 1,02,236 కాగా, చెల్లని ఓట్లు 9,764గా ఉన్నాయి. ఇక, ఇక్కడ పోటీలో ఉన్న కూటమి అభ్యర్ధి పేరాబత్తుల రాజశేఖరం 64,405 ఓట్లు వచ్చాయి. అదే విధంగా పిడిఎఫ్ అభ్యర్ధి దిడ్ల వీర రాఘవులు 23,252 ఓట్లు పోలయ్యాయి. కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం 41,153 ఒట్ల మెజార్టీ తో ముందంజ లో ఉన్నారు.. ఈ ఎన్నిక ల్లో వైసీపీ పోటీకి దూరంగా ఉంది.
MLC AP | గోదావరి జిల్లాల కూటమి అభ్యర్థి రాజశేఖరం 42 వేల ఓట్ల లీడింగ్
