MLC | గ్రామ అభివృద్ధి కోసం కృషి

MLC | గ్రామ అభివృద్ధి కోసం కృషి

  • ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సహకారంతో నిధులు తెస్తా
  • మంతటి గ్రామపంచాయతీ అభ్యర్థి సలేశ్వరం

MLC | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : మంతటి గ్రామపంచాయతీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సలేశ్వరం హామీ ఇచ్చారు. ఈ రోజు సలేశ్వరం గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే కూచుకుల రాజేశ్వర్ రెడ్డి బలపరిచిన అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.50 లక్షల సీసీ రోడ్లు, 30 ఇందిరమ్మ ఇల్లు, 260 రేషన్ కార్డులు, రూ.5 లక్షల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, 17 స్ప్రింక్లర్ పంప్ సెట్లు గ్రామ ప్ర‌జ‌ల‌కు అంద‌జేశామ‌ని తెలిపారు.

రాబోయే కాలంలో ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తానన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సహకారంతో నిధులు తీసుకువచ్చి పనులు చేయిస్తానని హామీ ఇచ్చారు. రెండో విడతలో ఇందిరమ్మ ఇండ్లు ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తామని తెలిపారు. వచ్చే రోజులలో అందరికీ అందుబాటులో ఉండి సేవలందిస్తానని కోరారు. ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందిస్తానని సలేశ్వరం ప్రచారంలో హామీ ఇస్తున్నారు.

Leave a Reply