MLA | సమస్యలు పరిష్కరిస్తా..

MLA | సమస్యలు పరిష్కరిస్తా..
- ఎమ్మెల్యే బొజ్జు పటేల్ దృష్టికి తీసుకెళ్తా..
- దంతన్ పెల్లి సర్పంచ్ అంకవ్వ
MLA | ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(MLA Vedma Bojju Patel) దృష్టికి దంతనపల్లి పంచాయతీ సమస్యలు తీసుకువెళ్లి పరిష్కరిస్తామని దంతన్ పెల్లి గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ అంకవ్వ, ఉపసర్పంచ్ మోబిన్ అన్నారు. వారు ఈ రోజు పంచాయతీలోని శివగూడ, ముస్లిం కాలనీలో చెడిపోయిన బోర్‌వెల్స్(Borewells) మరమ్మతు పనులను స్వయంగా దగ్గర ఉండి చేయించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమపై ఎంతో నమ్మకంతో ప్రజలు గెలిపించినందుకు వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సమస్యలు పరిష్కరిస్తూ అభివృద్ధి(Development)కి పాటుపడతామని అన్నారు. ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అరవింద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు దాసండ్ల రాజేష్, అర్బజ్ ఖాన్, కరోబారి తదితరులు పాల్గొన్నారు.
