MLA Venigandla Ramu | వంగవీటి.. ఆదర్శ నాయకుడు

MLA Venigandla Ramu | వంగవీటి.. ఆదర్శ నాయకుడు
- గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
MLA Venigandla Ramu | గుడివాడ, ఆంధ్రప్రభ : బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలబడి.. వారి హక్కుల కోసం నిరంతరం పోరాడిన పేదవర్గాల ఆదర్శనాయకుడు వంగవీటి రంగా అని గుడివాడ (Gudivada) ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కొనియాడారు. స్వర్గీయ వంగవీటి మోహన రంగా 37వ వర్ధంతిని జనసేన, టీడీపీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో బేతవోలులో జరిగిన వర్ధంతి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగా విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం టీడీపీ నాయకులు పండ్రాజు సాంబయ్య ఆధ్వర్యంలో ఏజీకే స్కూల్ సెంటర్లో జరిగిన వేడుకల్లో రంగా విగ్రహానికి ఎమ్మెల్యే నివాళులర్పించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
వర్ధంతి కార్యక్రమాల్లో ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన (janasena) ఇన్చార్జి బూర్రగడ్డ శ్రీకాంత్, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, టిడిపి నాయకులు పిన్నమనేని బాబ్జి ,చేకూరు జగన్మోహన్రావు…బేతవోలులో జరిగిన వర్ధంతి కార్యక్రమంలో పోలాసి ఉమా, తిరుపతిరావు, సొంటి రామకృష్ణ, పెన్నేరు విశ్వనాథ్, చీకటి సూర్యనారాయణ, ఉక్కుపాటి కుమార్, పల్లె పాట రాజా, యేసు పాదం,లోయ శివాజీ, కొడాలి రామరాజు, అట్లూరి స్వరూప్,సీతయ్య, నిరసి కాశి, గోవాడ శివ,లోయ విజయ్…. గుడివాడ జనసేన పార్టీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.
