శివాలయంలో గోపురాని ప్రారంభించిన ఎమ్మెల్యే, చైర్మన్ గీత

శివాలయంలో గోపురాని ప్రారంభించిన ఎమ్మెల్యే, చైర్మన్ గీత
చిట్యాల,ఆంధ్రప్రభ : శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని చిట్యాల మండలం వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, నకిరేకల్ శాసనసభ్యులు ఎమ్మెల్యే వేముల వీరేశం పుష్పక్క.చిట్యాల పట్టణం తొలుత చిట్యాల పట్టణంలోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. అనంతరం పట్టణంలోని శివాలయంలో స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకొని , ఆలయంలో పట్టణ ఆర్య వైశ్యుల సహకారంతో ఏర్పాటు చేసిన గోపురాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేముల వీరేశం పుష్ప దంపతులకు చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీత రమేష్ వారికి పూర్ణకుంభం పూల బోకే శాలువలతో సన్మానించి శ్రీరామనవమి వేడుకకు వచ్చిన సందర్భంగా ఘన స్వాగతం చైర్మన్ పలికారు.ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, నియోజకవర్గం అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి చెందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పందిరి గీత రమేష్, వైస్ చైర్మన్ గుండె బోయిన శ్రీ లక్ష్మీ సైదులు పందిరి శ్రీనివాసులు తెరటి పల్లి హనుమంతు కౌన్సిలర్లు తదితరు పాల్గొన్నారు.

