mla uma l విలువలతో కూడిన అభివృద్ధే నిజమైన ప్రగతి

mla uma l విలువలతో కూడిన అభివృద్ధే నిజమైన ప్రగతి
భవానిపురం, ఆంధ్రప్రభః నగరంలోని భవానీపురం బబ్బూరి గ్రౌండ్స్‌లో చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన 76వ వార్షికోత్సవం కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన హనుమాన్ చాలీసా 108 పారాయణంలో ఆయన భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. సాంకేతికంగా భౌతికంగా అభివృద్ధి ఎంత వేగంగా జరిగినా, విలువలతో కూడిన అభివృద్ధే నిజమైన ప్రగతి అని బొండా ఉమ అన్నారు. భగవద్గీత బోధించే స్వార్థరహిత కర్మ, నైతిక నాయకత్వం తమ ప్రభుత్వ పాలనకు మార్గదర్శక సూత్రాలుగా కొనసాగుతున్నాయని తెలిపారు. గత 76 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువలను ప్రజల్లో పెంపొందిస్తూ సమాజ హితానికి చిన్మయ మిషన్ అందిస్తున్న సేవలు నిజంగా స్ఫూర్తిదాయకమని బొండా ఉమ ప్రశంసించారు. ఇటువంటి కార్యక్రమాలు యువతలో సానుకూల దృక్పథాన్ని, మానవీయ విలువలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిన్మయ మిషన్ ప్రతినిధులు, ఆధ్యాత్మిక గురువులు, భక్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
