MLA | ఎమ్మెల్యే కు సత్కారం..!

MLA | ఎమ్మెల్యే కు సత్కారం..!

MLA | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : కోడూరు ఒకటో వార్డులో గల అయ్యప్పస్వామి దేవాలయానికి వెళ్లే రహదారి సరిగ్గా లేదని నిర్మాణం చేయాలని అయ్యప్ప స్వామి దేవాలయ కమిటీ వారు గతంలో ఎమ్మెల్యేని కోరారు. అవనిగడ్డ ఎమ్మెల్యే బుద్ద మండలి ప్రసాద్(MLA Buddha Mandali Prasad) నూతన సంవత్సర కానుకగా అయ్యప్ప స్వామి దేవాలయానికి బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.20లక్షలు మంజూరు చేసినట్లు ప్రకటించారు.

ఈసందర్భంగా ఇవాళ‌ అయ్యప్ప స్వామి దేవాలయం కమిటీ సభ్యులు అవనిగడ్డ ఎమ్మెల్యే నివాసంలో బుద్ద ప్రసాద్, వారి కుమారులు వెంకట్రాం, వారి అల్లుడు శీలం అశ్విని కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించి, కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో దేవాలయ ధర్మకర్త బడే భావనారాయణ, ప్రధాన కార్యదర్శి ఇంకొల్లు అశోక్ మహారాజ్, ఆలయ ప్రధాన అర్చకులు కొమ్మూరు శ్రీనివాస శర్మ, సభ్యులు తోట శ్రీనివాస రావు, మారుబోయిన ప్రసాద్, కోసూరు కుటుంబరావు, వేమూరు గోవర్ధన రావు పాల్గొన్నారు.

Leave a Reply