ఉట్నూర్, ఏప్రిల్ 12 (ఆంధ్రప్రభ) : ఉట్నూర్ పట్టణంలోని బోయవాడలో ఉన్న హనుమాన్ ఆలయంలో శనివారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హనుమాన్ మందిర్ లో వందలాదిగా తరలివచ్చిన భక్తుల కోసం ఆలయ పూజారి బాలాజీ ధోబె వర్మ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులు పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బోజ్జుపటేల్, ప్రముఖులు బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ భుఖ్య జాన్సన్ నాయక్, బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎంపీ రాథోర్ రమేష్ తనయుడు రితీష్ రాథోడ్, కాంగ్రెస్ పార్టీ అదిలాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి ఆత్రం సుగుణ, బీజేపీ రాష్ట్ర నాయకులు భానోత్ జగన్ శ్రీరామ్ నాయక్, ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్, సీఐ మొగిలి ఎస్సై మనోహర్ పాల్గొని పూజలు నిర్వహించారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే బోజ్జు పటేల్ హనుమాన్ జయంతి శోభాయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం శోభాయాత్రలో ఎమ్మెల్యే, ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు భక్తులు పాల్గొన్నారు. శోభాయాత్ర పట్టణంలోని ప్రధాన వీధుల్లో ఘనంగా ఎంతో ఉత్సవంగా జైశ్రీరామ్ నామస్మరణంతో కొనసాగింది. ఈ హనుమాన్ జయంతి వేడుకల్లో ఆదిలాబాద్ ఆర్టీఏ సభ్యులు దూట రాజేశ్వర్, హిందూ ఉత్సవ సమితి నాయకులు సాడిగే రాజగోపాల్, అరికెళ్ల అశోక్, రవీందర్, ఠాగూర్ గోపాల్ సింగ్, ఉట్నూర్ మాజీ వైస్ ఎంపీపీ దావులే బాలాజీ, బీజేపీ జిల్లా కార్యదర్శి కొండేరి రమేష్, కేంద్ర నాయకులు శ్రీరామ్ నాయక్, కాంగ్రెస్ నాయకులు కొత్తపెళ్లి మహేందర్, వివిధ పార్టీల నాయకులు, ఉద్యోగులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.