MLA Ravikumar | పోలియో చుక్కలు వేసిన ఎమ్మెల్యే

MLA Ravikumar | పోలియో చుక్కలు వేసిన ఎమ్మెల్యే
MLA Ravikumar | ఆముదాలవలస, ఆంధ్రప్రభ : ఆముదాలవలస పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన పల్స్ పోలియో చుక్కలు కార్యక్రమంలో ఎమ్మెల్యే రవికుమార్ పాల్గొన్నారు. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలియో వంటి ప్రమాదకర వ్యాధుల నుంచి చిన్నారులను రక్షించేందుకు పల్స్ పోలియో కార్యక్రమం అత్యంత కీలకమన్నారు. ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, కళాశాల సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
