రైతులకు సబ్సిడీ వ్యవసాయ పరికరాల పంపిణీ

రైతులకు సబ్సిడీ వ్యవసాయ పరికరాల పంపిణీ

మునుగోడు,ఆంధ్రప్రభ: రైతులకు వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలను అందజేస్తుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ తో కలిసి రైతులకు సబ్సిడీ వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారు.

నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గంలోని మునుగోడు,చండూరు, నాంపల్లి, మర్రిగూడ, గట్టుప్పల్ మండలాలకు చెందిన 98 మంది రైతులకు బ్యాటరీ స్ప్రేయర్లు,తైవాన్ స్ప్రేయర్లు,రోటవేటర్లు, కల్టివేటర్లు,ఎంబీ ప్లౌలు, కేజీ వీల్స్,పవర్ గ్రేడర్లు, బ్రష్ కట్టర్లు తదితర వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీఏ వేణుగోపాల్, వివిధ మండలాలకు చెందిన ఏవోలు, క్లస్టర్లకు చెందిన ఏఈవోలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply