MLA | బస్తీల పర్యటనలో ఎమ్మెల్యే శ్రీగణేష్..

MLA | బస్తీల పర్యటనలో ఎమ్మెల్యే శ్రీగణేష్..
MLA | కంటోన్మెంట్, ఆంధ్రప్రభ : ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన బస్తీల సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్(MLA Sriganesh) బస్తీల పర్యటన చేపట్టారు. 8 వ రోజు బస్తీ పర్యటనలో భాగంగా ఈ రోజు వార్డు 5 గాంధీనగర్, వాల్మీకి నగర్‌లలో శానిటేషన్(Sanitation), ఇంజనీరింగ్, ఎలక్ట్రిసిటీ, పోలీస్ డిపార్ట్ మెంట్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, బస్తీ వాసులతో కలసి క్షేత్రస్థాయిలో పర్యటించి వారి సమస్యలను గుర్తించారు.
ముఖ్యంగా బస్తీ వాసులకు ప్రస్తుతం ఉన్న కమ్యూనిటీ హాల్(Community Hall) పై మరొక ఫ్లోర్ అవసరం ఉన్నందున త్వరలోనే నిధులు కేటాయించి అదనపు ఫ్లోర్ ను వేయిస్తానని చెప్పారు. అలాగే మంచినీటి బోర్లు అవసరమైన చోట వెంటనే వేయిస్తానని, మెయిన్ రోడ్ వద్ద గతంలో ఉన్న బస్ షెల్టర్(Bus Shelter)ను పునరుద్దరణ చేయిస్తానని, అంతర్గత రహదారులు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడానికి కంటోన్మెంట్ అధికారులతో మాట్లాడి సమగ్రంగా ప్రణాళికలు తయారు చేయించి ఈ సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు.
ఈ పర్యటనలో ఎమ్మెల్యే శ్రీగణేష్ వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు సంకి రవీందర్, పెద్దాల.నరసింహ, సంతోష్ (విక్కీ), తేలుకుంట సతీష్, సాయి, బిక్షపతి, విష్ణు, బస్తీ పెద్దలు మల్లప్ప, గంటా రాజు, సత్యనారాయణ, తదితరులు ఉన్నారు.
