MLA | ఎమ్మెల్యే కడియంని కలిసిన సర్పంచ్, వార్డు సభ్యులు

MLA | ఎమ్మెల్యే కడియంని కలిసిన సర్పంచ్, వార్డు సభ్యులు
MLA | రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : ఇటీవల గ్రామపంచాయితీ ఎన్నికల్లో వేపలగడ్డ తండా గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన గుగ్గులోత్ మోతిలాల్ నాయక్ స్టేషన్ ఘనపూర్ అభివృద్ది ప్రదాత మాజీ ఉప ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరిని(MLA Kadiyam Srihari) మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ రోజు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, లింగాల జగదీశ్ రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కోళ్ల రవిగౌడ్ ఆధ్వర్యంలో హన్మకొండలోని ఎమ్మెల్యే కడియం శ్రీహరిని వారి స్వగృహంలో కలిసి పుష్పగుచ్చం అందించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈసందర్బంగా నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. గ్రామం అభివృద్ధి(Village Development)కి తమ సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు.
ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుగులోతు మోతిలాల్, ఉప సర్పంచ్ భూక్య బజ్జి నాయక్, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు బానోతు శ్రీను, నాయకులు పెంటపూరి మధు సుధన్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ జాత్మల్ నాయక్, సోషల్ మీడియా ఇంచార్జ్ రొయ్య భాస్కర్, రొయ్యల కమలకర్, రొయ్యల కొమురెల్లి భూక్య సేవ్య, దారావత్ తారచంద్, వార్డు సభ్యులు, నాయకులు, గ్రామస్థులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
