తిరువూరు, ఆంధ్రప్రభ : గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తిరువూరు పట్టణానికి చెందిన జనసైనికుడు జల్ది కార్తిక్‌కు తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు నివాళులు అర్పించారు. శుక్రవారం కార్తిక్ నివాసానికి చేరుకున్న ఎమ్మెల్యే, కార్తిక్ పార్థీవ దేహానికి పూలమాల వేసి నివాళులు సమర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
జనసైనికుడికి ఎమ్మెల్యే కొలికపూడి నివాళి..

