MLA Kolikapudi | భూముల కబ్జాపై ఆగ్రహం

MLA Kolikapudi | భూముల కబ్జాపై ఆగ్రహం
MLA Kolikapudi | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఎన్టీఆర్ జిల్లాలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ నడిరోడ్డుపై ధర్నాకు దిగడం సంచలనం రేపింది. జాతీయ రహదారి వెంట భూముల కబ్జాపై ఆయన నిరసన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ నడిరోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు. జాతీయ రహదారి పక్కన ఉన్న ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని ఆరోపించారు.
ఈ సందర్భంగా కబ్జాదారులను వెంటనే ఖాళీ చేయించాలని ఆయన అధికారులను కోరారు. ప్రభుత్వ స్థలాలను అక్రమంగా ఆక్రమిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ధర్నాతో ఆ ప్రాంతంలో కొంతసేపు రాకపోకలు అంతరాయం కలిగాయి. అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
