కేసీఆర్‌కు క్షమాపణ చెప్పే ధైర్యం ఉందా?

కేసీఆర్‌కు క్షమాపణ చెప్పే ధైర్యం ఉందా?

  • ఫిరాయింపుల అసలు సూత్రధారి కేసీఆరే
  • ముందుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
  • ఆయనకు రాజీనామాలపై మాట్లాడే హక్కు లేదు
  • స్పీకర్ తీర్పును తాను స్వాగతిస్తున్నాను
  • బిఆర్ఎస్ పార్టీ నియామవళి ప్రకారం షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలి
  • నైతిక విలువలు కేవలం కడియం కేనా…కేసీఆర్ కు వర్తించావా?
  • అసలు కేసీఆర్, కేటీఆర్‌లకు నైతిక విలువలు లెవా?:
  • స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

స్టేషన్ ఘన్ పూర్ , ఆంధ్రప్రభ: తెలంగాణలో రాజకీయ వ్యవస్థను బ్రష్టుపట్టించానని మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెబితే తాను ఆ మరుక్షణమే తన పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్తానని మాజీ ఉప ముఖ్య మంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సవాల్ విసిరారు. బుధవారం ప్రకటనలో స్పీకర్ తీర్పును స్వాగతిస్తూ ఆయన మాట్లా డారు. గతంలో కేసీఆర్ చేసిన చర్యలు తప్పని భావిస్తే తెలంగాణ ప్రజ లకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పే ధైర్యం కేసీఆర్‌కు ఉందా అని ప్రశ్నించారు.

క్షమాపణ చెప్పకపోతే తమ రాజీనామాల గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదని స్పష్టం చేశారు. 2014 నుండి 2023 వరకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇతర రాజకీయ పార్టీల నుండి ఎన్ని మంది ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్ పార్టీలో చేర్చుకున్నారో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపులకు పాత్రధారులు, సూత్రధారులు కేసీఆర్‌నే అని ఆరోపించారు. 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని పార్టీ మార్పులను ప్రోత్సహించడమే కాకుండా, పార్టీ మారిన ఇద్దరు ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు కూడా ఇచ్చిన చరిత్ర ఉందన్నారు. తెలంగాణలో ఇతర రాజకీయ పార్టీలు ఉండకూడదనే ఉద్దేశంతో శాసనసభాపక్షాలను సైతం పార్టీలో విలీనం చేసుకున్నారని విమర్శించారు. అయినా కేటీఆర్ సుద్దపూసలా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు.

స్పీకర్ తీర్పును స్వాగతిస్తున్నా:
పార్టీ ఫిరాయింపులపై దాఖలైన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. పార్టీ ఫిరాయింపులపై దాఖలైన పిటిషన్లు చట్టబద్ధం కావు. అసలు అనర్హత పిటిషన్‌కే అర్హత లేదని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ నియామవళి ప్రకారం పార్టీ ఫిరాయింపుకు పాల్పడిన సభ్యునికి ముందుగా షోకాజ్ నోటీసు జారీ చేసి వివరణ కోరాల్సి ఉంటుంది. అయితే తనకు ఎలాంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు.

వివరణ కూడా తీసుకోలేదన్నారు..తాను ఎప్పుడూ పార్టీ విప్‌ను దిక్కరించలేదని వెల్లడించారు. పార్టీ ఫిరాయింపుల అంశంపై కేసీఆర్ ఇప్పటివరకు మాట్లాడలేదు. పార్టీ తరఫున ఆయన ఎందుకు పిటిషన్ వేయలేదని ప్రశ్నించారు. శాసనసభ సమావేశాల్లో కేటీఆర్ తమ సభ్యు ల సంఖ్య 38 అని చెప్పి అందుకు అనుగుణంగా సమయం ఇవ్వాలని స్పీకర్‌ను కోరారని తెలిపారు. మరోవైపు తమపై అనర్హత వేటు వేయాల ని పిటిషన్ పెట్టినప్పటికీ, బీఆర్‌ఎస్ ఎల్‌పీకి నెలకు రూ.5 వేల చొప్పున తమ జీతం నుండి సభ్యత్వ రుసుము తీసుకుంటున్నారని కడియం శ్రీహరి పేర్కొన్నారు.

Leave a Reply