MLA | కాంగ్రెస్ పార్టీలో చేరికలు…

MLA | కాంగ్రెస్ పార్టీలో చేరికలు…
MLA | ఉట్నూర్ రూరల్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లాఉట్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(MLA Vedma Bojju Patel) సమక్షంలో ఉట్నూర్ మాజీ జెడ్పీటీసీ జగ్జీవన్(ZPTC Jagjeevan), లింగోజితండ మాజీ సర్పంచ్ హరినాయక్‌లు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వారికి ఎమ్మెల్యే పార్టీకండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసే పార్టీలో చేరుతున్నారని. కాంగ్రెస్ పార్టీ(Congress Party) పతకాలను ప్రభుత్వం చేస్తున్న మంచి పాలనను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని ఆయన అన్నారు .
ఈ కార్యక్రమంలో ఉట్నూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్, కాంగ్రెస్ నాయకులు దాసండ్ల ప్రభాకర్, ప్రభాకర్ రెడ్డి, కొత్తపెళ్లి మహేందర్, బిరుదుల లాజర్, ఖయ్యూం,ఖయ్యూం, హైమద్ తదితరులు పాల్గొన్నారు.
